స్కూటీ స్టాండ్‌ చంపేసింది!

ABN , First Publish Date - 2020-09-05T18:27:23+05:30 IST

స్కూటీ స్టాండ్‌ తీయకుండా వెళుతుండగా.. అది రోడ్డుకు తగిలి పడిపోవడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పాలకోడేరు మండలం పెన్నాడ లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదం వివరాలివి.. భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) పాలకొల్లు వైపు నుంచి మధ్యాహ్నం

స్కూటీ స్టాండ్‌ చంపేసింది!

పాలకోడేరు(పశ్చిమ గోదావరి జిల్లా): స్కూటీ స్టాండ్‌ తీయకుండా వెళుతుండగా.. అది రోడ్డుకు తగిలి పడిపోవడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పాలకోడేరు మండలం పెన్నాడ లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదం వివరాలివి.. భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) పాలకొల్లు వైపు నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. భీమవరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అది సకాలంలో రాకపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు 108 సిబ్బంది వచ్చి మృతి చెందాడని చెప్పి వెనుతిరిగారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-05T18:27:23+05:30 IST