లేసు పార్కులో లక్ష మాస్క్‌ల తయారీ

ABN , First Publish Date - 2020-03-25T10:35:58+05:30 IST

రుస్తుంబాద లేసు పార్కులో లక్ష మాస్క్‌ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు చెప్పారు. మంగళవారం

లేసు పార్కులో లక్ష మాస్క్‌ల తయారీ

నరసాపురం, మార్చి 24: రుస్తుంబాద లేసు పార్కులో లక్ష మాస్క్‌ల తయారీకి ఆర్డర్‌ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఏరియా వైద్యులతో సమిక్షించారు. నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్‌ వార్డును త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. మాస్క్‌ల కొరత అధికమించేందుకు లేసు పార్కుకు లక్ష మాస్క్‌ల తయారీకి అనుమతిచ్చామన్నారు. అవరసమైతే ఈసంఖ్యను పెంచుతామన్నారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Read more