-
-
Home » Andhra Pradesh » West Godavari » Make space for all the poor
-
పేదలందరికీ స్థలాలివ్వండి
ABN , First Publish Date - 2020-06-22T11:21:28+05:30 IST
ఏలూరు నియోజక వర్గంలో ఏ ఒక్క పేద కుటుంబం ఇళ్ళ స్థలం రాలేదని నా వద్దకు రాకూడదని.. అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
ఏలూరు రూరల్, జూన్ 21: ఏలూరు నియోజక వర్గంలో ఏ ఒక్క పేద కుటుంబం ఇళ్ళ స్థలం రాలేదని నా వద్దకు రాకూడదని.. అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు.జిల్లా కలెక్టర్ రేవు ముత్యా లరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఇతర అధికా రులతో ఆదివారం ఇళ్ళ స్థలాల పంపిణీపై సమీక్షి ంచారు. జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామన్నారు. ఏలూరులో ఇప్పటికే 360 ఎకరాల స్థలం సేకరణ చేశామని 210 ఎకరాల్లో మెరక పనులు పూర్తయ్యాయని చెప్పారు.
ఇళ్ళ స్థలాల దరఖాస్తులకు మరోసారి అవకాశం ఇవ్వ డంతో మరికొంత మంది లబ్ధిదారులు పెరిగా రని తెలిపారు.వారికి స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పారు. నగరంలో 30 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు,ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు అధికారులు జాబితాలను వేగవంతం చేయాలన్నారు. నూరుశాతం అందరికీ స్థలాలు పం పిణీ చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్య లుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పూడిక పనులు పూర్తిచేయాలని తెలిపారు.