-
-
Home » Andhra Pradesh » West Godavari » mak drill
-
అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ
ABN , First Publish Date - 2020-11-26T04:48:35+05:30 IST
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే చాలా వరకు అగ్నిప్రమాదాలను నివారించవచ్చని పాలకొల్లు అగ్నిమాపక అధికారి డి.సూర్యబ్రహ్మం అన్నారు.

యలమంచిలి, నవంబరు. 25: ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే చాలా వరకు అగ్నిప్రమాదాలను నివారించవచ్చని పాలకొల్లు అగ్నిమాపక అధికారి డి.సూర్యబ్రహ్మం అన్నారు. అగ్నిమాపక, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ ఆధ్వర్యంలో కొంతేరు జడ్పీ హైస్కూల్‌లో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహిం చారు. విద్యార్థులను సెర్చ్ టీం, రెస్క్యూ టీంలుగా విభజించి అగ్రిప్రమాద బారిన పడ్డవారిని రక్షించే విధానాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థుల తో ప్రదర్శన చేయించారు. అనంతరం అగ్నిమాపక పరికరాలను వినియో గించే విధానాలను విద్యార్థులకు వివరించారు. పాఠశాల హెచ్‌ఎం కె.శ్రీనివా సరావు, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.