మహిళలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-06T05:54:08+05:30 IST

నేటి సమాజంలో జరుగుతున్న లైంగిక దాడుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులకు, విద్యార్థినులకు పూరి ్తస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టరు ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టరు రాజ్యలక్ష్మి

పెదపాడు, డిసెంబరు 5: నేటి సమాజంలో జరుగుతున్న లైంగిక దాడుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులకు, విద్యార్థినులకు  పూరి ్తస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టరు ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు. మహిళా కమీషన్‌ ఆధ్వర్యంలో మహిళా మార్చ్‌ 100 కార్యక్రమాన్ని పెదపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ నేడు మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని, సినిమా, టీవీ, సీరియళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటోందన్నారు. ఐసీడీఎస్‌ పీడీ విజయ కుమారి మాట్లాడుతూ మహిళలు సమాజంలో జరిగే విషయాలపై అవగా హన పెంచుకోవాలన్నారు. పెదపాడు సొసైటీ అధ్యక్షుడు అక్కినేని రాజ శేఖర్‌, సీడీపీవో సునీల్‌ రాజశేఖర్‌, సెక్టారు సూపర్‌వైజర్లు నూర్జాహాన్‌, అప రంజి, మీనాక్షి, శివపార్వతీ, అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more