-
-
Home » Andhra Pradesh » West Godavari » madhavaipalem ferry tdp protest
-
రాజకీయ కక్షతో రేవు మూత
ABN , First Publish Date - 2020-12-11T05:22:22+05:30 IST
రాజకీయ కక్ష, కమీషన్ల కోసమే మాధవాయి పాలెం రేవులో పంటు, పడవల రాకపోకలను అధికార పార్టీ నాయకులు నిలిపి వేయించారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, మాజీ ఎమ్మెల్యే బండారు మాదవనాయుడు ఆరోపించారు.

మాధవాయిపాలెం రేవులో టీడీపీ నేతల ఆందోళన
రాకపోకలు పునరుద్ధరించాలని డిమాండ్
నరసాపురం, డిసెంబరు 10: రాజకీయ కక్ష, కమీషన్ల కోసమే మాధవాయి పాలెం రేవులో పంటు, పడవల రాకపోకలను అధికార పార్టీ నాయకులు నిలిపి వేయించారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, మాజీ ఎమ్మెల్యే బండారు మాదవనాయుడు ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు పునరుద్ధరించాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో గురు వారం రేవులోని ఖాళీ పంటుపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని రేవు ల్లో రాకపోకలు సాగుతున్నాయన్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే మాధవాయిపాలెం రేవును మూసి వేయడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అధికా రులు కూడా వైసీపీ కండువాలు కప్పుకుని అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ప్రజలు ఇబ్బందులు పట్టించుకోకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను సాకుగా చూపి పంటును తిప్పకపోవడం సరికాదన్నారు. తొమ్మి ది నెలలుగా రాకపోకలు నిలిపివేయడంతో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రేవులో రాకపోకలు పునరుద్ధరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళ నను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో పొత్తూరి రామరాజు, టీడీపీ నరసాపురం మహిళా అధ్యక్షురాలు రత్నమాల, కొప్పాడ రవి, రాయుడు శ్రీరాములు, పొన్నాల నాగబాబు, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, భూపతి నరేష్, అధికారి అనంతరామారావు, మల్లాడి మూర్తి, షేక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
రేవు రాజకీయం
ఇరిగేషన్ శాఖకు చెందిన పంటు రెండు నెలల క్రితం ధవళేశ్వరం నుంచి నరసాపురం మాధవాయిపాలెం రేవుకు చేరింది. ఏడు నెలలుగా నరసాపురం – సఖినేటిపల్లి మధ్య నిలిచిన రాకపోకలు తాత్కాలికంగా పునరుద్ధరించాలని అధికారులు పంటు రప్పించారు. పంటుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రాలేదని రెండు నెలలు అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా పంటు తిరగకుండా అడ్డుపడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అధికారులు రెండు నెలలుగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదా తిరస్కరించడం వంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది.
