హైస్కూళ్లలో ఫైర్‌ మాక్‌ డ్రిల్‌ : డీఈవో

ABN , First Publish Date - 2020-11-26T05:02:21+05:30 IST

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో అగ్ని ప్రమాదాల నివారణకు బుధవారం ఫైర్‌ మాక్‌డ్రిల్‌ను నిర్వహించినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

హైస్కూళ్లలో  ఫైర్‌ మాక్‌ డ్రిల్‌ : డీఈవో

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 25 : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో అగ్ని ప్రమాదాల నివారణకు బుధవారం ఫైర్‌ మాక్‌డ్రిల్‌ను నిర్వహించినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. పాఠశాలల్లో జీ ప్లస్‌ వన్‌ అంతస్తుతో నిర్మాణం ఉన్న 28 హైస్కూళ్లల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు డివిజన్లలో స్థానిక అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది సహకారంతో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చ ర్యలపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యక్షంగా చూపడం ద్వారా మాక్‌ డ్రిల్‌ నిర్వ హించామన్నారు. ఏలూరులోని ఏఆర్‌డీజీకే హైస్కూల్‌లో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను ఆమె పరిశీలించారు.  

Read more