జిల్లాలో 789 కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2020-11-08T05:27:26+05:30 IST

జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లలో 789 కేసులు పరిష్కరించినట్టుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 789  కేసులు పరిష్కారం

ఏలూరు క్రైం, నవంబరు 7: జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లలో 789 కేసులు పరిష్కరించినట్టుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్‌ కేసులు 351 పరిష్కరించగా, చెక్కు బౌన్స్‌ కేసులు 9, ఎక్సైజ్‌ కేసులు 111, భార్యాభర్తల కేసులు 9, విద్యుత్‌ చోరీలకు సంబం ధించిన 198 కేసులు పరిష్కరించారు. మోటారు వాహన  ప్రమాద బీమా కేసులు 67 పరిష్కరించారు. సివిల్‌ కేసులు 44 పరిష్క రించారు. మొత్తం 789 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-11-08T05:27:26+05:30 IST