7న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2020-11-01T05:06:01+05:30 IST

నవంబరు 7న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌బాబు తెలిపారు.

7న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌

కొవ్వూరు, అక్టోబరు 31: నవంబరు 7న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌. శరత్‌బాబు తెలిపారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వూరు, గోపాలపురం, తాళ్లపూడి, దేవరపల్లి ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో కక్షిదారుల మధ్య  రాజీ కుదుర్చి  కేసులు రాజీ చేసుకోవడానికి మార్గదర్శకాలు సూచించారు.  ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె. వెంకటేశ్వరరావు, ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె. మాధవి,  ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె. శారదాంబ పాల్గొన్నారు. 

Read more