-
-
Home » Andhra Pradesh » West Godavari » liquor pattiveta two members arest west godavari dist
-
అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-12-28T05:45:24+05:30 IST
అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరె స్ట్ చేశామని ఏలూరు టూ టౌన్ పోలీసులు తెలిపారు.

ఏలూరు క్రైం : అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరె స్ట్ చేశామని ఏలూరు టూ టౌన్ పోలీసులు తెలిపారు. పవరుపేట ప్రాంతంలో ఆదివారం ఓ ఇంటి వద్ద మద్యం అమ్ముతున్నారని టూటౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్‌కు సమాచారం తెలిసింది. దీంతో ఆయనతో పాటు ఎస్‌ఐ ఎన్‌ఆర్ కిషోర్‌బాబు ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. మోటారు సైకిల్‌లో మద్యం బాటిళ్లను పెట్టి విక్రయిస్తున్న నిర్మల్ తేజ, సాయిరాజులను అరెస్ట్ చేశారు. వీరు తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 8 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని రూ. 4,800 నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.