-
-
Home » Andhra Pradesh » West Godavari » library
-
విజ్ఞాన సంపద భద్రపరిచేవి గ్రంథాలయాలే
ABN , First Publish Date - 2020-11-22T04:22:37+05:30 IST
విజ్ఞాన సంపదను భద్రపరిచేవి గ్రంథా లయాలేనని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వంగా నరసింహారావు అన్నారు.

పాలకొల్లు అర్బన్, నవంబరు 21: విజ్ఞాన సంపదను భద్రపరిచేవి గ్రంథా లయాలేనని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వంగా నరసింహారావు అన్నారు. శనివారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి నరసింహారావు అధ్యక్షత వహించి ప్రసంగించారు. విద్యావేత్త, విశ్రాంత అధ్యాపకుడు మాడభూషి కృష్ణప్రసాద్ ముఖ్యవక్తగా మాట్లాడుతూ పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమ తులు అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నందుల రమణి, జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుడు తమ్మినీడి సత్యనారాయణ రావు, గ్రంధాలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.