స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిద్దాం : ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2020-03-25T10:35:31+05:30 IST

స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిద్దాం.. మనలను మనం కాపాడుకుందాం అంటూ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన

స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిద్దాం : ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, మార్చి 24: స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిద్దాం.. మనలను మనం కాపాడుకుందాం అంటూ కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  మంగళ వారం పాదయాత్ర చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం మూడు నాలుగడుగుల దూరం  పాటించాలని, షాపులకు వెళ్ళినా ఈ పద్ధతిని పాటించాలని,  కరచాలనం చేయకుండా  నమస్కరించాలన్నారు. చేతుల ను శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రత పాటించాలన్నారు.

Read more