-
-
Home » Andhra Pradesh » West Godavari » left parties protest on farming act
-
నల్ల చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:34:27+05:30 IST
బీజేపీ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి.

వామపక్షాల డిమాండ్
ఆకివీడు, డిసెంబరు 15: బీజేపీ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా మంగళవారం రాత్రి పొట్టిశ్రీరాముల విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. పట్టణ పౌరుల సంక్షేమ సంఘం కన్వీనర్ గేదెల అప్పారావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి బైరి ఆం జనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు వ్యవసాయరంగాన్ని కట్టపెట్టేందుకే నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. తవిటినాయుడు, బి.రాంబాబు, షేక్ వలీ, చందక సూరిబాబు, సురేష్ బలరాం పాల్గొన్నారు.
ఫ యలమంచిలి: రైతు ఆందోళనకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో మం గళవారం చించినాడలో ర్యాలీ నిర్వహించారు. బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టా లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానేటి బాలరాజు, మాచవరపు సత్యనారాయణ, కొల్లా వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.
మొగల్తూరు: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. యడ్ల చిట్టిబాబు, వీరా పాండురంగారావు, చిలకలపూడి నాగేశ్వరరావు, మల్లిపూడి బుల్లియ్య, అడ్డాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.