-
-
Home » Andhra Pradesh » West Godavari » Latest News in Telugu
-
రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ABN , First Publish Date - 2020-11-01T05:05:53+05:30 IST
state inaguaration

ఏలూరు సిటీ, అక్టోబరు 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో వివిధ శాఖల అఽధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం ఆవరణలో నవంబరు 1వ తేదీన ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పతకావిష్కరణ చేస్తారని తెలిపారు. తొలుత ఉదయం 9 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.సంబంఽధిత శాఖల అధికారులు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. జేసీలు వెంకటరమణారెడ్డి, తేజ్ భరత్, ఏలూరు ఆర్‌డీవో రచన, జడ్పీ సీఈవో శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.