హరోం..హర

ABN , First Publish Date - 2020-12-01T05:47:24+05:30 IST

కార్తీక పౌర్ణమి, పా డ్యమితో పాటు సోమవారం కలసి రావడంతో శివాలయాలు భక్తులతో కళకళ లాడాయి.

హరోం..హర
కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గోదావరి స్నానాలు

మూడో సోమవారం శివాలయాలు కిటకిట

భీమవరం టౌన్‌ /పాలకొల్లు అర్బన్‌, నవంబరు 30 : కార్తీక పౌర్ణమి, పా డ్యమితో పాటు సోమవారం కలసి రావడంతో శివాలయాలు భక్తులతో కళకళ లాడాయి. మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. జిల్లాలోని శైవక్షేత్రాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయానికి 15 వేలమంది వరకు భక్తులు దర్శిం చుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. టికెట్ల ద్వారా రెండు లక్షల 12 వేల రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. పాల కొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారుగా 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఈవో యాళ్ళ సూర్యనారాయణ తెలిపారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో పెద్దసంఖ్యలో భక్తులు గోదావరి స్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. ఆలయాల్లో పూజలు చేశారు.

Updated Date - 2020-12-01T05:47:24+05:30 IST