నాడు-నేడుకు నిధుల కొరత

ABN , First Publish Date - 2020-09-05T10:14:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన బడి నాడు-నేడు పథకం పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. పాఠశాలల రూపురేఖలు మా

నాడు-నేడుకు నిధుల కొరత

నిడమర్రు సెప్టెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన బడి నాడు-నేడు పథకం పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. పాఠశాలల రూపురేఖలు మార్చాలనే సంక ల్పంతో ప్రారంభించిన ఈ పథకం నిధుల లేక చివరిలో చతి కిలపడుతోంది. పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులలో ఐదు గురు, పాఠశాల హెచ్‌ఎం, ఇంజనీరింగ్‌ అధికారితో కలిసి ఏడుగురితో నాడు-నేడు కమిటీ ఏర్పాటు చేసి ఈ పనులు ప్రారంభించారు.


పనుల ప్రారంభం నుంచి ఇసుక  కొరత, మరోపక్క సిమెంట్‌ కొరత ఇబ్బంది పెట్టాయి. పనులు మూడొంతులు పూర్తి కావచ్చే సమయానికి నిధులు నిల్‌ అంటూ చేతులెత్తేయడం పేరెంట్స్‌ కమిటీ సభ్యులను గంద రగోళంలోకి నెట్టింది. జిల్లాలో 1088 పాఠశాలలో నాడు నేడు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పాఠశాలలకు పను లు నిమిత్తం రూ.134.10 కోట్లు అవసరమని అంచనా వేశా రు. ఇప్పటి వరకు రూ.110.85 కోట్లు విడుదల చేశారు.


రూ.23.25 కోట్లు విడుదల కావాలని అధికా రులు చెబుతున్నారు. జిల్లాలో పాఠశాల ల్లో పనులు 60 నుంచి 70 శాతం వరకు పూర్తవుతున్న తరుణంలో నిధుల కొరత వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతు న్నాయి. పాఠశాల అభివృ ద్ధికి పేరెంట్స్‌ కమిటీలు కొన్నిచోట్ల ఉత్సాహంగా సొంత నిధులతో పనులు చేశారు. ఆగస్టు మొదటి వా రం నుంచి నిధులు విడుదల ఆగిపోవడంతో తాము పెట్టిన సొమ్ము ఎప్పుడు వస్తోందా అని ఆందోళన చెందుతున్నారు.


ఇప్పటికే ప్రతి పాఠశాలకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు నిధు లు విడుదలై పనులు ప్రారంభమయ్యాయి. చివరిలో సొమ్ములు లేక పనులు ఆగిపోవడంతో దిగుమతి చేసుకొన్న ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, చెక్క సామగ్రి పాడవుతున్నాయని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


గడువులోగా పూర్తి కానట్లే...!

ప్రారంభంలో నాడు-నేడు పనులు జూన్‌ 12వ తేదీ నాటి కి పూర్తి కావాలని అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకొ న్నారు. ఇసుక, సిమెంట్‌ కొరత వల్ల పనులు మందకొడిగా సాగా యి.  వర్షాలు, కరోనా కారణంగా నాడు-నేడు పనులకు బ్రేక్‌ పడుతూ వచ్చింది. తర్వాత కాలంలో పనులు గాడిన పడ్డా యని భావించి ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని సంక ల్పించారు. అయినా పనులు పూర్తికాలేదు. నేడు ఉపాధ్యా య దినోత్సవం సెప్టెంబరు 5 నాటికి పూర్తిచేసి పాఠ శాల లు ప్రారంభించాలని పెట్టుకొన్న లక్ష్యం నిధుల కొరత కారణంగా నెరవేరడం లేదు. చాలా పాఠశాలలు అరకొర పనులతో అస్తవ్యస్తంగా ఉన్నాయి.


ఈ పరిస్థితిలో పాఠశాలలు ఎలా తెర వాలంటూ ఉపాధ్యాయ వర్గాలు ఆందో ళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని పాఠశాలలు పేరెంట్స్‌ కమిటీ సభ్యు లు తమ సొంత వనరులతో పను లు పూర్తి చేయగలిగారు. 10 శాతం పాఠశాలలు పెయింటింగ్‌ మినహా అన్నీ పూర్తి చేసుకున్నాయి. ఇలాంటి చోట్ల పేరెంట్స్‌ కమిటీ సభ్యులు తమ పాఠశాలలకు పెయింటింగ్‌ వర్క్స్‌ మొదలు పెట్టాలని అధికారులకు  విన్నవిం చుకొంటున్నారు. 

Updated Date - 2020-09-05T10:14:28+05:30 IST