క్షీరాబ్ది ద్వాదశి పూజలు

ABN , First Publish Date - 2020-11-27T04:54:26+05:30 IST

కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పూజను గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

క్షీరాబ్ది ద్వాదశి పూజలు
ఆచంటేశ్వరుడికి అభిషేకం

ఆచంట, నవంబరు 26: కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పూజను గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆచంటేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఏటా రామగుండం చెరువులో తెపోత్సవం నిర్వహించేవారు. కరోనా నిబంధనల కారణంగా తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.


యలమంచిలి : మండలంలోని పలు ఆలయాలు, ఇళ్ల వద్ద మహిళలు క్షీరాబ్ది ద్వాదశి పూజలు నిర్వహించారు. తులసి, ఉసిరి మొక్కలకు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. కేశవస్వామి ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు తులసిదళాలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి గోపి క్షీరాబ్ది ద్వాదశి విశిష్టతను భక్తులకు వివరించారు.

Updated Date - 2020-11-27T04:54:26+05:30 IST