కాపు యువజన సేన జిల్లా అధ్యక్షుడిగా సాయిరాం
ABN , First Publish Date - 2020-12-10T06:24:00+05:30 IST
కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా యువజన సేన అధ్యక్షుడిగా తణుకు పట్టణానికి చెందిన బడేటి సాయిరాంను నియమించారు.

తణుకు, డిసెంబరు 9 : కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా యువజన సేన అధ్యక్షుడిగా తణుకు పట్టణానికి చెందిన బడేటి సాయిరాంను నియమించారు. మాజీ మంత్రి, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హరిరామజోగయ్య ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేశారని సాయి రాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా జేఏసీని బలోపేతం చేయడంతో పాటు కాపుల అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఆయన నియామకం పట్ల యువసేన రాష్ట్ర అఽధ్యక్షుడు ఎ.కృష్ణప్రసాద్, నాయకులు ఆకుల రమణమూర్తి, గంధం సత్యశేఖర్, మంగిన శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.