కాళ్ళకూరు ఆలయంలో ప్రత్యేక హోమాలు

ABN , First Publish Date - 2020-12-12T04:26:35+05:30 IST

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్ర వారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

కాళ్ళకూరు ఆలయంలో ప్రత్యేక హోమాలు
ప్రత్యేక అలంకరణలో వేంకటేశ్వరస్వామి

కాళ్ళ, డిసెంబరు 11: కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్ర వారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో మూడో రోజు ఆలయంలో పవిత్రాదివాసం, పూర్ణాహుతి రథబలి నిర్వహించారు. గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు స్వామి దర్శనం ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేపట్టారు. సప్తనదులు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక జలాలతో శనివారం స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.Updated Date - 2020-12-12T04:26:35+05:30 IST