కాల్వ పరిరక్షణ ఏదీ..?

ABN , First Publish Date - 2020-11-08T04:42:28+05:30 IST

జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో తూర్పులాకుల నుంచి పడమర లాకుల వరకు గల కాల్వ అపరిశుభ్రతకు నిలయంగా ఉంది.

కాల్వ పరిరక్షణ ఏదీ..?
ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో కాల్వలో ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్థాలు

 చెత్తా చెదారాలతో అధ్వానం 

ప్రక్షాళన చేపట్టాలంటూ నగరవాసుల వినతి

ఏలూరు కార్పొరేషన్‌, నవంబరు 7 : జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో తూర్పులాకుల నుంచి పడమర లాకుల వరకు గల కాల్వ అపరిశుభ్రతకు నిలయంగా ఉంది. కాల్వ నగర మధ్య భా గంలో ఉండడంతో రెండు వైపులా కూడా అనేక నివాసాలు, వ్యా పార సంస్థలు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారాలు, వ్యర్థాలు కాల్వలో పడేస్తున్నారు. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల గట్ల మీద ఉన్న చెట్ల కొమ్మలు విరిగి కాల్వలోకి పడిపోయాయి. వాటిని తొలగించిన దాఖలాలు లేవు.  దీంతో నీటి పారుదలకు కూడా విఘాతంగా నెలకొంది. పాలకులు  చర్యలు తీసుకుని కాల్వ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, పరి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాల్వలో పడిన వృక్షాలను తొల గించాలని, కాల్వ గట్లను పటిష్టపర్చడం ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి నీరు దిగువ ప్రాంతాలకు వెళ్ళేందుకు అనువుగా ఉంటుం దని సూచిస్తున్నారు. అంతేకాకుండా కాల్వ గట్ల వెంట వ్యర్థాలు, చెత్తాచెదారాలు ఉండడం వల్ల దుర్వాసనలు వస్తున్నాయని, కుక్క లు,  పందులు విచ్చలవిడిగా తిరగడంతో పారిశుధ్యం మరింత అ ధ్వానంగా మారుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ కారణంగా దోమల బెడద ఎక్కువైయిందని నగరవాసులు వాపోతున్నారు. కాల్వ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.  

Updated Date - 2020-11-08T04:42:28+05:30 IST