ప్రతి ఒక్కరు క్షమాగుణం కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-11-08T04:48:53+05:30 IST

సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే బంధాలు అనుబంధాలు శాశ్వతంగా నిలుస్తాయని ఆ బంధాలు నిలవాలంటే క్షమాగుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు అన్నారు.

ప్రతి ఒక్కరు క్షమాగుణం కలిగి ఉండాలి
లోక్‌అదాలత్‌లో మాట్లాడుతున్న జిల్లా జడ్జి భీమారావు

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు 

ఏలూరు క్రైం, నవంబరు 7: సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే బంధాలు అనుబంధాలు శాశ్వతంగా నిలుస్తాయని ఆ బంధాలు నిలవాలంటే క్షమాగుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు అన్నారు. వర్చువల్‌ జాతీయ లోక్‌అదాలత్‌ను ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన తప్పు మళ్లీ చేయకుండా సక్రమమార్గంలో జీవిం చాలన్నారు. అహాన్ని అహంకారాన్ని ఒదులుకుని కేసులను రాజీ చేసుకోవడం వల్ల సఖ్యత పెరుగుతుందన్నారు. రాజీ చేసుకోవాల్సిన కేసులను వీలైన త్వరితగతిన లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివల్ల సమయం, డబ్బు వృఽథా కాదన్నారు. జిల్లా అదనపు జడ్జి మేరీ గ్రేస్‌కుమారి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారం చేసుకోవడంతో ఎలాంటి కోర్టు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సమయం వృథా కాదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఏలూరు బార్‌ అధ్యక్షుడు అబ్బి నేని విజయకుమార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డి.బాల కృష్ణయ్య, ద్రాటౌన్‌ సీఐ మూర్తి, డీసీఆర్బీ సీఐ జీవీ కృష్ణారావు, న్యాయ వాదులు, కక్షిదారులు, ఇన్సూరెన్సు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-08T04:48:53+05:30 IST