10వ తేదీకి ఇళ్ల స్థలాలు సిద్ధం కావాలి : జేసీ
ABN , First Publish Date - 2020-12-02T04:39:54+05:30 IST
ఇళ్ల స్థలాలను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలని జేసీ వెం కట రమణారెడ్డి ఆదేశిం చారు.
తణుకురూరల్/ఇరగవరం, డిసెంబరు 1 : ఇళ్ల స్థలాలను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలని జేసీ వెం కట రమణారెడ్డి ఆదేశిం చారు.తణుకు,ఇరగవరం మం డలాల్లో లేఅవుట్లను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలను పంపిణీ చేస్తుందన్నారు. ఆయన వెంట ఎంపీడీవోలు ఎస్టీవీ రాజేశ్వరరావు, సూర్యనారాయణమూర్తి, తహసీల్దార్లు రాజరాజేశ్వరి, పీఎన్‌డీ ప్రసాద్, ఏవో మద్దాల జయదుర్గా మాధురి తదితరులు పాల్గొన్నారు.