28న ఎస్సీ నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2020-11-26T05:04:37+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరం పల్లిలోని భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీ రింగ్‌, టెక్నాలజీ (సీఐపీఈటీ) కళాశాల ప్రాంగణంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఈనెల 28వ తేదీ శనివారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లింకుడ్‌ జాబ్‌ మేళా నిర్వహించ నున్నట్టు మేనేజర్‌, హెడ్‌ చింతాశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

28న ఎస్సీ నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా

ఏలూరు రూరల్‌, నవంబరు 25 : కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరం పల్లిలోని భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రో కెమికల్స్‌ ఇంజనీ రింగ్‌, టెక్నాలజీ (సీఐపీఈటీ) కళాశాల ప్రాంగణంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఈనెల 28వ తేదీ శనివారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లింకుడ్‌ జాబ్‌ మేళా నిర్వహించ నున్నట్టు మేనేజర్‌, హెడ్‌ చింతాశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ ప్లాస్టిక్స్‌ అనుబంధ సంస్థల్లో 200 మిషన్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలను సీఐపీఈటీ సంస్థ ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆరు నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇవ్వడం ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలోపు వయస్సు కలిగి పదోవతరగతి, ఐటీఐ డిప్లమో పాస్‌ లేక ఫెయిల్‌ అయిన నిరుద్యోగ ఎస్సీ యువత ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ విద్యార్హత, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌, తెల్లరేషన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో ఈనెల 28న ఉదయం 10 గంటలకు సీఐపీఈటీ కళాశాల ప్రాంగణంలో జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. 

Read more