-
-
Home » Andhra Pradesh » West Godavari » Jidigunta ramp
-
తవ్వేయ్.. అమ్మేయ్.!
ABN , First Publish Date - 2020-06-23T10:51:39+05:30 IST
జిల్లాలో ఇసుక.. రాజకీయ నాయకులకు వరంగాను, సామాన్యులకు శాపంగాను మారింది.

జీడిగుంట ర్యాంపులో నిబంధనలకు నీళ్లు
కూలీలతో కొత్త తరహా ఒప్పందం
చక్రం తిప్పుతున్న స్థానిక రాజకీయ నేత
నిడదవోలు, జూన్ 22 : జిల్లాలో ఇసుక.. రాజకీయ నాయకులకు వరంగాను, సామాన్యులకు శాపంగాను మారింది. ఇసుక ధర భారమై సామాన్యులకు అందకుండా కష్టతరంగా మారితే మరోవైపు కొంతమంది రాజకీయ నేత లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక అక్రమంగా దొడ్డి దారిన తరలిపోతున్నా.. గోదావరిలో ఎక్స్‌కవేటర్‌తో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిడదవోలు మండలం జీడిగుంట ఇసుక ర్యాంపు దీనికి నిదర్శనం. ఈ ర్యాంపులో ఒక షిఫ్ట్ మాత్ర మే కార్మికులు ఇసుకను తవ్వుతారు. ఆ తర్వాత అంతా గో దావరిలో ఎక్స్‌కవేటర్‌లే ఇసుకను తవ్వుతాయి. ఇసుక తవ్వే కార్మికులు అడ్డగించకుండా వారితో ఒప్పందం చేసు కున్నట్టు గ్రామస్తులే బాహాటంగా చెబుతున్నారు. ఈ ర్యాం పులో ఒక యూనిట్ బుక్ ఇసుక చేసుకున్నా అనధికారి కంగా ఎన్ని యూనిట్లైనా ఇంటికి నేరుగా వచ్చేస్తుందని చెబుతారు.
ప్రధానంగా లారీల్లో నింపిన ఇసుకను తూచేం దుకు వే బ్రిడ్జి(కాటా) లేకపోవడం ఈ ర్యాంపునకు వరం గా మారింది. మరోవైపు గ్రామానికి చెందిన ఒక రాజకీయ నేత ర్యాంపును గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయిం చడమే కారణం. ఈ రాజకీయ నేత ర్యాంపు ప్రారంభానికి ముందుగానే అనధికారికంగా ఎక్స్‌కవేటర్ ద్వారా ఇసుకను తవ్వించి గ్రామంలో నిల్వ చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై సమిశ్రగూడెం పోలీస్‌స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో నేటికీ పురోగతి లేకపోవడం వెను క రాజకీయమే కారణం. ఇసుకను తవ్వడానికి ఉపయో గించే ఎక్స్‌కవేటర్‌ను నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేయగలి గిన పోలీసులు ఎక్స్‌కవేటర్‌ను ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇప్పటికైనా అనధికారికంగా అడ్డదారినపోతున్న ఇసుక దం దాపై అధికారులు దృష్టి సారించి సామాన్యులకు అందు బాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.