జీవక్రాంతి అర్హులు.. 6,441 మంది

ABN , First Publish Date - 2020-12-11T05:37:22+05:30 IST

జిల్లాలో జగనన్న జీవ క్రాంతి పథకం కింద గొర్రెలు, మేకలు కొనేందుకు 6,441 మంది లబ్ధిదారులను గుర్తించినట్టు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు.

జీవక్రాంతి అర్హులు.. 6,441 మంది
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జేసీలు

పథకం ప్రారంభంలో కలెక్టర్‌ ముత్యాలరాజు

ఏలూరుసిటీ, డిసెంబరు 10 : జిల్లాలో జగనన్న జీవ క్రాంతి పథకం కింద గొర్రెలు, మేకలు కొనేందుకు 6,441 మంది లబ్ధిదారులను గుర్తించినట్టు  జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాట్లాడుతూ 4951 మంది లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వగా, ఇప్పటి వరకు 1,477 మంది గొర్రెలు, మేకల యూనిట్లు కొనుగోలుకు ఆసక్తి చూపారని తెలిపారు. 364 యూని ట్లకు బ్యాంకు లింకేజీ ద్వారా 710 యూనిట్లకు ఉన్నతి ద్వారా డాక్యుమెంటేషన్‌ పూర్తి చేశామన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ (రెవెన్యూ) కె.వెంకటరమణారెడ్డి, జేసీ (సంక్షేమం) ఎన్‌.తేజ్‌భరత్‌, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ పి.శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:37:22+05:30 IST