‘సచివాలయాలన్నీ త్వరగా పూర్తి కావాలి’

ABN , First Publish Date - 2020-11-26T05:06:08+05:30 IST

గ్రామ సచివాలయాలన్నీ నిర్ణీత సమయం లోపే త్వరగా పూర్తి కావాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు.

‘సచివాలయాలన్నీ త్వరగా పూర్తి కావాలి’

ద్వారకా తిరుమల, నవంబరు 25 : గ్రామ సచివాలయాలన్నీ నిర్ణీత సమయం లోపే త్వరగా పూర్తి కావాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలో పంగిడిగూడెం, గొల్లగూడెం, తిమ్మాపురం తదితర గ్రామాల్లో నిర్మి స్తున్న సచివాలయాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షిం చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆశీర్వాదం, తహసీల్దార్‌ జాన్సన్‌, ఏవో ఆర్‌. వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more