నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-02T04:49:17+05:30 IST

రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆచంట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌ చేగొండి సూర్యప్రకాశ్‌ విమర్శించారు.

నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలి
ఆచంట మండలంలో దెబ్బతిన్న పంట పరిశీలిస్తున్న జనసేన నాయకులు

జనసేన నాయకుల డిమాండ్


ఆచంట/పెనుగొండ, డిసెంబరు 1: రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆచంట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌ చేగొండి సూర్యప్రకాశ్‌ విమర్శించారు. నివర్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న చేలను మంగళ వారం జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. రైతులు అన్నివిధాల దెబ్బతిన్నప్పటికి అధికార, ప్రతిపక్ష నాయకులు రైతులను పరామర్శించిన ధాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పెనుగొండ మండలం తామరాడ, కొఠాలపర్రు గ్రామాల్లో  పడిపోయిన చేలను పరిశీలించారు. జవ్వాది బాలాజీ, అడ్డాల దుర్గారావు, నంబూరి విజయ్‌, పితాని లక్ష్మణ్‌, కుంపట్ల రమేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-02T04:49:17+05:30 IST