సమాచారం ఎందుకివ్వరు
ABN , First Publish Date - 2020-11-14T04:39:48+05:30 IST
మునిసిపాలిటీ పరిధిలో గత ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వరని జనసేన పార్టీ భీమవరం నియోజకర్గ ఇన్‌చార్జ్, మునిపల్ మాజీ చైర్మన్ కొటికల పూడి గోవిందరావు (చినబాబు) అధికారులను నిలదీశారు.
అధికారులను నిలదీసిన మునిసిపల్ మాజీ చైర్మన్
భీమవరం, నవంబరు 13 : మునిసిపాలిటీ పరిధిలో గత ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వరని జనసేన పార్టీ భీమవరం నియోజకర్గ ఇన్‌చార్జ్, మునిపల్ మాజీ చైర్మన్ కొటికల పూడి గోవిందరావు (చినబాబు) అధికారులను నిలదీశారు. ఆయన మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్యామలతో సమాచార వివరాలపై శుక్రవారం మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేశానని, సమాచారం సమగ్రంగా ఇవ్వలేదని ప్రశ్నించారు. సమాచారా న్ని సంపూర్ణంగా ఇస్తామని చినబాబుకు కమిషనర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట వేగేశ్న కనకరాజు సూరి, చెనమల్ల చంద్రశేఖర్ ఉన్నారు.