-
-
Home » Andhra Pradesh » West Godavari » janasena
-
జగన్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి
ABN , First Publish Date - 2020-12-06T05:50:50+05:30 IST
ప్రజలకు మేలు చేస్తామని హా మీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం తాయిలాల ఆశ చూపి పక్కాగా పక్కదారి నుంచి భారీగా దోపిడీలకు పాల్ప డుతున్న వైసీపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయని జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు.

జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 5 : ప్రజలకు మేలు చేస్తామని హా మీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం తాయిలాల ఆశ చూపి పక్కాగా పక్కదారి నుంచి భారీగా దోపిడీలకు పాల్ప డుతున్న వైసీపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయని జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. జనసేన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో అవసరం ఉన్నా, లేకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాల రూపాల్లో తాయిలాలు పంచుతూ మరోపక్క ప్రజల నుంచి పన్నుల రూపంలో విపరీతమైన దోపిడీ చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ చెబుతూనే 20, 30 ఏళ్ల క్రితం ఇచ్చిన డీఫారం పట్టా భూముల్లో 50 గజాల స్థలంలో కూడా ప్లాన్ పెట్టుకోవాలని చెబుతూ వలంటీర్ల ద్వారా అక్రమ నోటీసులు ఇస్తున్నారని, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను సైతం కూలుస్తామని బెదిరిస్తూ స్థానిక నాయకులు పేదల వద్ద డబ్బుల వసూలుకు పాల్పడుతు న్నారన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు నగర కమిటీ అధ్యక్షుడు కాశీ నరేష్, మండల కమిటీ అధ్యక్షులు వీరంకి పండు, సరిది రాజేష్, ధర్మేంద్ర, బొత్స మధు, అల్లు చరణ్, గిరిజాకుమారి పాల్గొన్నారు.