రాయితీ రుణాలతో చిరు వ్యాపారులకు మేలు

ABN , First Publish Date - 2020-11-26T05:01:59+05:30 IST

చిరు వ్యాపారులకు 50శాతం రాయితీతో జగనన్న తోడు రుణాలు అందించాలని ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ కోరారు.

రాయితీ రుణాలతో చిరు వ్యాపారులకు మేలు
పాలకొల్లులో చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు రూరల్‌ / యలమంచిలి, నవంబరు 25 : చిరు వ్యాపారులకు 50శాతం రాయితీతో జగనన్న తోడు రుణాలు అందించాలని ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ కోరారు. మండల పరిష త్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో సంగాని వెంకటేశ్వరరావు అధ్యక్షత న జరిగిన జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ రూ.10వేలు చిరు వ్యాపారులకు ఏమాత్రం తోడు కాదన్నారు. రుణం పొందిన ప్రతి లబ్ధిదారు సక్రమంగా వాయిదాలను చెల్లించాలన్నారు. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు కరోనా కారణంగా నష్టపోయా రన్నారు. ప్రతి చిరు వ్యాపారికి రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకు 50 శాతం సబ్సిడీపై రుణాలను అందించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌, కోడి విజయభాస్కర్‌, పెచ్చెట్టి బాబు, ధనాని సూర్య ప్రకాశ్‌, వలంటీర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


యలమంచిలి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మల లబ్ధిదారులకు ఐడీ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లను అందించారు. డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, ఈవోపీఆర్డీ కె.వైభావతి పాల్గొన్నారు.భీమవరం టౌన్‌: జగనన్నతోడు కార్యక్రమంలో 4వేల మందికి రూ. 4.2 కోట్ల రుణాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అందించారు. రానున్న రోజుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ.లక్ష రుణం అందించే అవకాశం ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, కామన నాగేశ్వరరావు, రేవూరి గోగురాజు, రాయప్రోలు శ్రీనివాస మూర్తి, కోడే యుగంధర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, ఎంపీడీవోలు జి పద్మ, స్వాతి, మెప్మా సీఏ గ్రంధి పార్వతి, ఏపీఎం అమీరునిషా, రవి తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం రూరల్‌: నియోజకవర్గంలోని 5062 మంది చిరు వ్యాపారులకు ప్రభుత్వం జగన్నన తోడు పథకంలో రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే ప్రసాదరాజు అందించారు. ఏఎంసీ చైర్మన్‌ దొండ పాటి స్వామి, కమిషనర్‌ సత్యవేణి, ఎంపీడీవో ప్రసాద్‌యాదవ్‌, ఆనందకు మార్‌, పద్మ, దొంగ మురళి, వైకేఎస్‌ పాల్గొన్నారు.

Read more