నిబంధనలు పాటించకుంటే ప్రమాదమే : గ్రంధి

ABN , First Publish Date - 2020-03-30T09:21:56+05:30 IST

సామాజిక దూరం పాటించకుండా ఇష్టాను సారం వ్యవహరించడం ప్రమాదకరమని ఎమ్మెల్యే గ్రంధి

నిబంధనలు పాటించకుంటే ప్రమాదమే : గ్రంధి

భీమవరం టౌన్‌, మార్చి 29 : సామాజిక దూరం పాటించకుండా ఇష్టాను సారం వ్యవహరించడం ప్రమాదకరమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పట్టణ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా పట్టణ ప్రజలు లాక్‌డౌన్‌కు ఎంతగానో సహకరించారని, ఐతే ఆదివారం నాడు వందలాది మంది రోడ్లపైకి రావటం, సామాజిక దూరం పాటించకపోవటం, కనీసం మాస్కులు కూడా ధరించకుండా బయటకు రావటం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. 


దీని వల్ల జరిగే నష్టం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, సమాజాన్ని, కుటంబాలను దృష్టిలో పెట్టుకుని వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి వేడుకొంటున్నానని ఆయన అన్నారు. ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని కోరారు.

Updated Date - 2020-03-30T09:21:56+05:30 IST