వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-14T10:35:57+05:30 IST

వలంటరీ పోస్టులకు అధికారులు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నారు.

వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెంటపాడు/ పాలకోడేరు/ పెరవలి రూరల్‌, సెప్టెంబరు, 13 : వలంటరీ పోస్టులకు అధికారులు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నారు. పెంటపాడు 14, పాలకోడేరు 5, పెరవలి 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 16 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయా మండలాల ఎంపీడీవోలు దామోదర్‌రావు, వెంకట అప్పారావు, విజయలక్ష్మి  సూచించారు. అభ్యర్థులకు ఈనెల 1వ తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసు ఉండాలని, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఆధార్‌, విద్యార్హతలు, కులధ్రువీకరణ తదితర పత్రాలను కూడా జతపర్చాలన్నారు. 17వ తేదీన దరఖాస్తులు పరిశీలించి ఈనెల 18, 19 తేదీల్లో మండల పరిషత్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-09-14T10:35:57+05:30 IST