న్యాయవాద శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-06-23T10:56:20+05:30 IST

జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన అర్హులైన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి 2020-21 సంవత్సరానికి న్యాయవాద వృత్తిలో ..

న్యాయవాద శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు రూరల్‌, జూన్‌ 22 : జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన అర్హులైన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి 2020-21 సంవత్సరానికి న్యాయవాద వృత్తిలో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమాధికారి ఏఎన్‌వీ కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. మూడేళ్ల శిక్షణ ఉంటుందన్నారు. నెలకు రూ.10 వేలు స్టైఫండ్‌, రూ.585 ఎన్‌రోల్‌ మెంట్‌ ఫీజు, రూ.మూడు వేలు న్యాయశాస్త్ర పుస్తకాలు, ఫర్నీచర్‌ కొనుగోలు నిమిత్తం ఒక్క పర్యాయం మాత్రమే ఇస్తార న్నారు. శిక్షణకు కుటుంబ వార్షిక ఆదాయం లక్షలోపు ఉన్న వారు అర్హులన్నారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి న్యాయవాదిగా నమోదు అయి 23-35 ఏళ్ల మధ్య  వారు  శిక్షణకు అర్హులన్నారు. దరఖాస్తులు జులై 6వ తేదీ నాటికి ఏలూరు కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.  

Read more