ఇంటర్‌ ప్రయోగ పరీక్షకు 311 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2020-02-08T11:44:41+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షకు జిల్లాలో 5,680 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో

ఇంటర్‌ ప్రయోగ పరీక్షకు 311 మంది గైర్హాజరు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 7 : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షకు జిల్లాలో 5,680 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో బి.ప్రభాకర్‌రావు తెలిపారు. జిల్లాలోని 62 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్‌ విభాగంలో 3,721 మందికి 3,673 మంది, ఒకేషనల్‌ విభాగంలో 2,270 మందికిగాను 2,007 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 311 మంది గైర్హాజరయ్యారు.  


Updated Date - 2020-02-08T11:44:41+05:30 IST