ఇంటర్‌కు 996 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2020-03-12T08:40:34+05:30 IST

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం జిల్లాలోని 103 కేంద్రాల్లో ప్రశాంతంగా సాగాయి.

ఇంటర్‌కు 996 మంది గైర్హాజరు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 11 : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం జిల్లాలోని 103 కేంద్రాల్లో ప్రశాంతంగా సాగాయి.ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరం గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలకు మొత్తం 32,512 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్‌ఐవో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. జనరల్‌ విభాగంలో 30,703 మందికి  29,990 మంది, ఒకేషనల్‌ విభాగంలో 2805 మందికి 2522 మంది హాజరయ్యారు. మొత్తం 996 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు కాలేదు. 

Updated Date - 2020-03-12T08:40:34+05:30 IST