ఆక్వాకు ఊరట

ABN , First Publish Date - 2020-03-24T11:31:16+05:30 IST

కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

ఆక్వాకు ఊరట

అంతర్‌ జిల్లాల పర్మిట్లు ఇవ్వాల్సిందే 

రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అరుతే ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల రవాణ, దిగుమతులను మినహాయించారు. ఈ క్రమంలోనే జిల్లాలో కీలకంగా ఉన్న ఆక్వా పరిశ్రమకు కూడా మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మత్స్యశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.


ఆహార ధాన్యాలు, కాయ, ఆకుకూరలు, పాలు, మాంసం సహా చేపలు, రొయ్యలు వంటి ఆహార పదార్థాల పరిమితమైన ఎగుమతి, దిగుమతులకు అనుమతులు మంజూరు చేశారు.  ఆహార, నిత్యావసర వస్తువుల రవాణాను అడ్డుకోకుండా జిల్లాలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.  

Read more