ఇందిరా గాంధీ సేవలు ఆదర్శనీయం

ABN , First Publish Date - 2020-11-20T05:13:03+05:30 IST

దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ సేవలు ప్రపంచానికి ఆదర్శనీయమని కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు ఇన్‌చార్జి రాజనాల రామ్మోహన్‌రావు అన్నారు.

ఇందిరా గాంధీ సేవలు ఆదర్శనీయం

ఏలూరు కార్పొరేషన్‌, నవంబరు 19 : దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ సేవలు ప్రపంచానికి ఆదర్శనీయమని కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు ఇన్‌చార్జి రాజనాల రామ్మోహన్‌రావు అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కాం గ్రెస్‌, సేవాదళ్‌ నాయకులు, మహిళా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, సేవాదళ్‌ చైర్మన్‌ కమ్ముల కృష్ణ, గౌడు రంగబాబు, లంకా రామ్మోహన్‌, దండుబోయిన చంద్రశేఖర్‌, తాళ్ళూరి చక్రవర్తి, కాటూరి దుర్గాప్రసాద్‌, కోసూరి చంద్రకాంతమ్మ, లక్ష్మీశైలజ, రాయల సతీశ్‌, సేవాదళ్‌ సుబ్బారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T05:13:03+05:30 IST