-
-
Home » Andhra Pradesh » West Godavari » Implementation of 144 Section
-
రోడ్లపైకి రావద్దు
ABN , First Publish Date - 2020-03-24T11:23:13+05:30 IST
కరోనా వ్యాధి సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించ డంతో సోమవారం జిల్లావ్యాప్తంగా దుకాణాలు మూతపడ్డాయి.

జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలి
రెస్టారెంట్లు, బార్‌లు, హోటళ్లు, టీ దుకాణాలు తెరవకూడదు
ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరగకూడదు
ఐదుగురుకంటే ఎక్కువగా గుమికూడవద్దు
నిబంధనలు అతిక్రమిస్తే పోలీసు కస్టడీ
జిల్లావ్యాప్తంగా దుకాణాలు కిటకిట..
నిర్మానుష్యంగా రహదారులు
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కేంద్రం 188 సెక్షన్.. అధికా రులు 144 సెక్షన్ విధించారు. ఈ నెలాఖరు వరకు ఇవి అమల్లో ఉంటాయి. వీటిని ఎవ రైనా మీరితే కఠిన చర్యలు తప్పవు. రోడ్లపై ఎవరూ కూడా గుంపులు గుంపులుగా సంచ రించకూడదు. సామాజిక దూరం పాటిం చాలి. రోడ్లపై వాహనాలు రాకూడదు.
ఏలూరు క్రైం, మార్చి 23 : కరోనా వ్యాధి సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించ డంతో సోమవారం జిల్లావ్యాప్తంగా దుకాణాలు మూతపడ్డాయి. రైళ్లు, బస్సులు, ఇతర రవాణా వాహ నాలు తిరగలేదు. కిరాణా, పాలు, మెడికల్ దుకాణా లను మాత్రమే తెరిచారు. కిరాణా సరుకులు, కూరగాయల కోసం జనం రోడ్లపైకి రావడంతో కాస్త సందడి కనిపించింది. ఉదయం యథావిధిగా షాపులన్నీ తెరుచుకోగా పోలీసులు రంగంలోకి దిగి నిత్యావసర వస్తువులు, పచారీ వస్తువులు, పాలు, పండ్లు, కూరగాయల షాపులు మినహా మిగిలినవి మూయించారు. అయినప్పటికీ జనం యథావిధిగానే వాహనాలతో రోడ్లపైకి రావడంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ స్టాపర్‌లతో దిగ్బంధనం చేశారు.
ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు, వెళ్లకుండా పూర్తిగా నియంత్రించారు. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలువరించారు. జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ స్వయంగా నగరంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. టూ టౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్, త్రీ టౌన్ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్లలో ఉంటూ వాహ నాలను నియంత్రించారు. షాపులలో మాస్క్‌లు లేనిదే ఎవరినీ అనుమతించడం లేదు. షాపులో కొద్ది మందిని మాత్రమే ఉంచి వారు బయటికి వచ్చిన తరువాత మాత్రమే మిగిలిన వారిని పంపిస్తున్నారు. ఏలూరు పత్తేబాద రైతు బజార్, వన్ టౌన్ రైతు బజార్లలో సోమ వారం వేకువజాము నుంచే ప్రజలు కూరగాయల కోసం రావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భీమ వరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెంలలో ఉదయం నుంచి సందడిగానే ఉంది. ఎక్కువ మంది సమూహంగా ఉండనివ్వకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.
జిల్లాలో 144 సెక్షన్ విధింపు : కలెక్టర్
జిల్లాలో సోమవారం నుంచి సీఆర్‌పీసీ 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది తిరగరాదని, గుమిగూడ రాదని తెలిపారు. ఎపిడమిక్ డీసీజెస్ యాక్ట్ 1897 సెక్షన్ 2, 3, 4 కింద రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. సామాజిక దూరం పాటించాలని, వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, అవసరమైతే తప్ప బయటకు రావడానికి అనుమతులు లేవన్నారు.
లాక్‌డౌన్ పాటించాల్సిందే : ఎస్పీ
ప్రజలందరూ కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆదేశించారు. సోమవారం నిర్వహిం చిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ఆయనతో 34 మందితో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎవరూ అతిక్రమించరాదని, ఐదుగురుకు మించి గుంపులు గా తిరగరాదని, ఎలాంటి ఫంక్షన్లు చేయకూడదన్నారు. ప్రయాణాలు, విహారయాత్రలు నిషేధమని, విదేశాల నుంచి వచ్చిన వారు తమ గది నుంచి బయటికి రాకూడ దన్నారు. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, పూర్తిగా బంద్ పాటించాలని చెప్పారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, జిమ్‌లు, ఫంక్షన్ హాల్స్ మూసివేయాలన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలను బయటకు పంపకూడదన్నారు. గుళ్లు, చర్చిలు, మసీదులన్నీ మూసివేయాలన్నారు.
తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకి రావాలని అత్యవసర సేవల ఉద్యోగులు బయటకు వెళ్లవచ్చునన్నారు. రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రజలెవరూ రోడ్లపై సంచారం చేయకూడదన్నారు. ప్రైవేటు వాహనాలు రహదారులపై ప్రయాణించడం నిషేధమన్నారు. ఏదైనా అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుని 24 గంటలూ కస్టడీలో ఉంచుతామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించి జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో ఫంక్షన్ నిర్వహించిన ఆకుల సుధాకర్‌పై కేసు నమోదు చేశామన్నారు.