అక్రమ మద్యం, సారా పట్టివేత
ABN , First Publish Date - 2020-05-24T09:59:30+05:30 IST
జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న మద్యంతో పాటు సారాను ఎస్ఈబీ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకుని ..

జంగారెడ్డిగూడెం/తాడేపల్లిగూడెం రూరల్/లింగపాలెం/టి.నరసాపురం/ పోల వరం, మే 23 : జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న మద్యంతో పాటు సారాను ఎస్ఈబీ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. తెలం గాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జంగారెడ్డిగూడెం సీఐ సీహెచ్ అజయ్‌కుమార్ సింగ్ తెలిపారు. వారి నుంచి సుమారు రూ.లక్ష విలువైన 200 మద్యం సీసాలు, కారు, మూడు ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకు న్నట్టు వివరించారు. తాడేపల్లిగూడెం మండలంలో సారా తర లిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పారావుపేట వంతెన వద్ద చేపల పాండురంగా రావును పట్టుకుని 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. మెట్ట ఉప్పరగూడెంకు చెందిన మోసపాటి సత్యనారాయణ, కిళ్లి లక్ష్మణ్‌లను పట్టుకుని వారి నుంచి 20 లీటర్ల సారా, రెండు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ ఎ.మస్తానయ్య తెలిపారు.
గతంలో సారా కాసే పూర్వపు నేరస్తులైన మరో నలుగురిని తాడేపల్లిగూడెం తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్టు తెలిపారు. అక్రమంగా సారా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ధర్మాజీగూడెం ఎస్ఐ యు. లక్ష్మీ నారాయణ తెలిపారు. శనివారం లింగపాలెం శివారు జూబ్లీనగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌పై ఇద్దరు సారా తరలిస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకుని 15 లీటర్లు సారాని స్వాధీనం చేసుకుని మోటారు సైకిల్ని సీజ్ చేసినట్టు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు టి.నరసాపురం ఎస్ఐ పి.ప్రేమరాజు తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీలోకి లంకాలపల్లి చెక్‌పోస్టు నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని రూ.8930ల విలువైన 18 మద్యం సీసా లు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పోలవరం మండలం ఎల్ఎన్డీపేట గ్రామ శివార్లలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపి పొదలలో దాచిన 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ జి. సత్యనారాయణ తెలిపారు.