హైదరాబాద్ రైలు పునరుద్ధరణ
ABN , First Publish Date - 2020-02-08T12:25:01+05:30 IST
నరసాపురం- హైదరాబాద్‌ల మధ్య ఆదివారం 07258 నెంబర్‌తో నడిచే స్పెషల్ రైలును మళ్లీ పునరుద్ధరించారు.ఈ రైలు ఆదివారం సాయం త్రం

నరసాపురం, ఫిబ్రవరి 7 : నరసాపురం- హైదరాబాద్‌ల మధ్య ఆదివారం 07258 నెంబర్‌తో నడిచే స్పెషల్ రైలును మళ్లీ పునరుద్ధరించారు.ఈ రైలు ఆదివారం సాయం త్రం ఆరు గంటల నుంచి యధావిధిగా నడవనుంది.
గుంటూరు మీ దుగా వెళ్లి తెల్లవారుజామున 4.40 గంటలకు హైద రాబాద్ చేరుకుంటుంది. 2019 ఏప్రిల్ నెలలో ఈ రైలును ప్రారంభించారు. అయితే గత నెల చివరిలో నిర్వహణ పేరుతో రైల్వే ఆదివారం రైలును రద్దు చేసింది. దీంతో ప్రయాణీకులకు కష్టాలు ఆరంభమయ్యాయి. అయితే చాలా మంది రైలు అవశ్యకతను నేతలు, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు శుక్రవారం దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది.18 కోచ్‌లతో రైతులు నడుస్తుందని రైల్వే మేనేజర్ మధుబాబు శుక్రవారం తెలిపారు.