ఇళ్ల నిర్మాణం రద్దు చేస్తారా..
ABN , First Publish Date - 2020-11-04T04:49:52+05:30 IST
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ స్వయంగా తెలుసుకున్నారు.
పాలకొల్లు అర్బన్, నవంబరు 3 : టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ స్వయంగా తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నా ఇల్లు – నా సొంతం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 13, 14, 15 వార్డులో వారు పర్యటించారు. రివర్స్ టెండరిం గ్‌లో రూ.400 కోట్లు ఆదా చేయడం అంటే ఇళ్ల నిర్మాణం రద్దు చేయడమా అని వారు ప్రశ్నించారు. సెంటు స్ఠలంలో లబ్ధిదారు ఏవిధంగా ఇల్లు నిర్మిం చుకోగలరో చెప్పాలన్నారు. వైసీపీ నాయకులకు రాజసౌధాలు, బంగళాలు కావాలి కానీ, సామాన్యులు మాత్రం సెంటు స్థలంతో సరిపెట్టుకోవాలా అని ప్రశ్నించారు. ఇళ్లు అప్పగించాలని కోరుతూ పోస్టుకార్డులను లబ్ధిదారుల వద్ద నుంచి స్వీకరించారు. బిరుదుకోట శేఖర్, పెచ్చెట్టి బాబు, జివి, మల్లంపల్లి ఫకీర్ బాబు, కొండ్రేడ్డి సూరిబాబు, ధనాని సూర్య ప్రకాశ్, నాగబాబు, బోణం మునసబు, అల్లం తాతాజీ, అన్నాబత్తుల దుర్గా భాస్కరరావు, కవురు ముత్యాలరావు, సిహెచ్‌జ్ఞాన శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లను అప్పగించండి
టిడ్కో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని బీజేపీ పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్, కార్యదర్శి కొల్లి కొండప్రసాద్, కోశాధికారి కొణిజేటి గుప్త మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు 2015లో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ప్రారంభించి పేదల కు గృహాలు నిర్మించిందన్నారు. పాలకొల్లులో ఆదునిక సదుపాయాలతో టిడ్కో ఆధ్వర్యంలో 90శాతం నిర్మాణం పూర్తయిన ఇండ్లను (పెంకుళ్ళపాడు వద్ద) లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలంటూ కోరారు. ఇప్పటికైనా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని డిమాండ్ బీ జేపీ నాయకులు జక్కంపూడి కుమార్, కేకే.ప్రసాద్, కొణిజేటి గుప్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.