పేదలకు ఇళ్లు నిర్మిస్తాం : మంత్రి శ్రీరంగనాథరాజు

ABN , First Publish Date - 2020-12-27T04:38:25+05:30 IST

ఆకివీడు మండలం తాళ్ల కోడులో 3,101 మంది లబ్ధిదారులకు రూ.500 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్ట నున్నట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు.

పేదలకు ఇళ్లు నిర్మిస్తాం : మంత్రి శ్రీరంగనాథరాజు
తాళ్ళకోడులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే

తాళ్ళకోడు (ఆకివీడు రూరల్‌) డిసెంబరు 25 : ఆకివీడు మండలం తాళ్ల కోడులో 3,101 మంది లబ్ధిదారులకు రూ.500 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్ట నున్నట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. 25మంది లబ్ధి దారులకు ఐదుగురితో కమిటీ ఏర్పాటుచేసి ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. జనవరిలో వెంకయ్య వయ్యేరు కాల్వపై వంతెనకు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పదేళ్ల క్రితం ఇళ్ల స్థలాలు సేకరణకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును మంత్రి కొనియాడారు.


ఆకివీడు పట్టణ ప్రజలకోసం సేకరించిన తాళ్ళకోడు ఇళ్ల స్థలాలను పట్టా ణాభివృద్దిలో చేర్చాలని ఉండి ఎమ్మెల్యే రామరాజు మంత్రి దృష్టికి తీసుకె ళ్ళారు. నియోజకవర్గంలో 70 గ్రామాలలో 40 గ్రామాలు ఏలూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ పరిధిలోనికి తీసుకురావాలని విన్నవించారు. సబ్‌ కలెక్టరు చాహత్‌ బాజ్‌పేయ్‌, హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి, గోకరాజు రంగరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పీవీఎల్‌ నరసింహరాజు, తహసీల్దారు కుమార్‌, హౌసింగ్‌ ఏఈ భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు.


పాలకొల్లు టౌన్‌/ యలమంచిలి: యలమంచిలి మండలం కొంతేరులో పాలకొల్లు పట్టణ ప్రాంతానికి చెందిన 2,832 మందికి ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు.  


పోడూరు: పి.పోలవరం, కవిటం గ్రామాల్లో లబ్ధిదారులకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. జేసీ వెంకట రమణరెడ్డి, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ రాయితీలను లబ్ధిదారులకు వివరించారు.  


భీమవరం రూరల్‌ / వీరవాసరం : భీమవరం మండలంలోని వెంప, పెదగరువు, శ్రీరామపురం గ్రామాల లబ్ధిదారులకు వెంప లేఅవుట్‌లో శనిఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. వెంపలో 115 మంది, శ్రీరామపురంలో 17 మంది, పెదగరువులో 51 మందికి పట్టాలను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ ఏవి రమణారావు, పంచాయితీరాజ్‌ డీఈ ఐఆర్‌కె.రాజు, ఎంపీడీవో జి.పద్మ, హౌసింగ్‌ ఏఈ రామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలంలోని  మత్స్యపురి, బొబ్బనపల్లిలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ పట్టాలు పంపి ణీ చేశారు. తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, ఎంపీడీవో జి.స్వాతి, హౌసింగ్‌ ఏఈ సాయిబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం రూరల్‌: పట్టణ, మండలంలో 566 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇళ్ల పట్టాలందించారు. చిట్టవరం, గొంది, కొత్త, పాత నవరసపురం గ్రామాలకు చెందిన 163 మందికి చిట్టవరం సభలో మిగిలిన 403 మందికి మండలంలోని మంగళగుంటపాలెంలో సేకరించిన స్థలంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ శుక్లా పట్టాలు అందజేశారు. ఏఎంసీ చైర్మన్‌ స్వామి, కెనడీ, దొంగ మురళీ, చల్లా సత్యనారాయణ, కాకిలేటి ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:38:25+05:30 IST