లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాలు అందజేస్తున్న మంత్రులు కృష్ణదాస్‌, నాని

ABN , First Publish Date - 2020-12-28T05:41:21+05:30 IST

పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాలు అందజేస్తున్న మంత్రులు కృష్ణదాస్‌, నాని
లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాలు అందజేస్తున్న మంత్రులు కృష్ణదాస్‌, నాని

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,282 మందికి పట్టాలు అందజేత

ఏలూరు రూరల్‌, డిసెంబరు 27 : పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఏలూరు రూరల్‌ మండలం చొదిమెళ్ళ శివారు లక్ష్మీపురంలో ఆదివారం రెండువేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9,796 మందికి మొత్తం ఇప్పటి వరకు 28,282 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు అందజేశామన్నారు. స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు నిర్మించి వారి కల నిజం చేస్తున్నామని దేశ చరిత్ర లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. ఉప ముఖ్యమంత్రి నాని మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి సౌకర్యం కల్పించి అందిసా ్తమన్నారు. కార్యక్రమంలో జేసీ కె. వెంకటరమణారెడ్డి, ఆర్డీవో పనబాక రచన, తహసీల్దార్‌ బి. సోమశేఖర్‌, ఏలూరు మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, వైసీపీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎన్‌. సుధీర్‌బాబు, బొద్దాని శ్రీనివాస్‌, అన్నపనేని రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

31 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తాం 

మంత్రి శ్రీరంగనాథరాజు 

దెందులూరు, డిసెంబరు 27 : రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని, మొదటి విడతగా 15 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సోమవరప్పాడులో స్థానిక ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఆయన ఆదివారం అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అ ర్హతే కొలమానంగా కులమతాలకు అతీతంగా అర్హులందరికీ అన్ని పథకాలు అందించి తీరుతామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌పాం అభివృద్ధి బోర్డు చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, తహసీల్దార్‌ వి.శేషగిరిరావు, ఎంపీడీవో లక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మేకా లక్షణారావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:41:21+05:30 IST