గూడెం ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు
ABN , First Publish Date - 2020-12-02T04:54:01+05:30 IST
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభిం చినట్టు సూపరింటెండెంట్ దామోదరరెడ్డి తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 1 : తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభిం చినట్టు సూపరింటెండెంట్ దామోదరరెడ్డి తెలిపారు. కొవిడ్ కారణంగా ఏరియా ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు నిలుపుదల చేసి ఇప్పటి వరకూ కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు ప్రారంభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.