కొవ్వూరు టోల్‌గేట్‌ వద్ద హిజ్రాలకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-11-26T05:15:26+05:30 IST

కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌కు అటంకం కలిగించవద్దని కొవ్వూరు టౌన్‌ సీఐ ఎంవీవీఎన్‌ఎన్‌ మూర్తి అన్నారు.

కొవ్వూరు టోల్‌గేట్‌ వద్ద హిజ్రాలకు కౌన్సెలింగ్‌

కొవ్వూరు నవంబరు 25 : కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌కు అటంకం కలిగించవద్దని కొవ్వూరు టౌన్‌ సీఐ ఎంవీవీఎన్‌ఎన్‌ మూర్తి అన్నారు.టోల్‌గేట్‌ వద్ద పోలీసులు హిజ్రాలకు బుధవారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రాజమహేంద్రవరం, కొవ్వూరులను కలుపుతూ నిర్మించిన గామన్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ రాకపోకలు అధికంగా ఉండడంతో పాటు, హిజ్రాలు వాహనదారులను ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో బుధవారం టోల్‌గేట్‌ వద్ద బందోబస్తు నిర్వహించారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ కె.వెంకటరమణ, పి.రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more