వల్లభాయ్‌ పటేల్‌కు నివాళి

ABN , First Publish Date - 2020-11-01T04:55:42+05:30 IST

ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు శనివారం ముత్యాలపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

వల్లభాయ్‌ పటేల్‌కు నివాళి
ముత్యాలపల్లిలో పటేల్‌ విగ్రహం వద్ద నివాళి

మొగల్తూరు అక్టోబరు 31 : ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు శనివారం ముత్యాలపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఆరోగ్యవర్షిణి సంస్థ ఆధ్వర్యంలో ఉపా ధ్యాయులు, గ్రామ పెద్దలు పటేల్‌ విగ్రహనికి పూల మాలలువేసి నివాళులర్పించారు. పటేల్‌ దేశ స్వాతంత్య్ర పోరాటంలో కృషి, ఉపప్రధానిగా దేశానికి అందించిన సేవలను వివరించారు. సంస్థ కార్యదర్శి నాగిడి రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more