భారీ వర్షం
ABN , First Publish Date - 2020-10-08T10:12:14+05:30 IST
పట్టణంలో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలచిపోయింది. దాదాపు గంటకు పైగా ఉరుములు,

భీమవరం, పాలకొల్లులో
పల్లపు ప్రాంతాలు జలమయం
భీమవరం టౌన్, అక్టోబరు 7 : పట్టణంలో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలచిపోయింది. దాదాపు గంటకు పైగా ఉరుములు, మెరుపుల తో కురిసిన వర్షంతో జన జీవనానికి అంత రాయం కలిగింది. వర్షనికి రోడ్లు పక్కన నీరు నిలచిపోయింది. డ్రెయిన్లు లాగకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. గంట తరువాత నీరు లాగెయ్యడంతో ప్రజలు ఊపిరి పీల్చుకు న్నారు. రైతుబజార్, నాచువారి సెంటర్, డీఎన్ ఆర్ కళాశాల రోడ్డు, జువ్వలపాలెం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.
పాలకొల్లు అర్బన్: కొద్దిపాటి వర్షానికే పట్ట ణంలో పలు కాలనీలు జలమయం అవుతున్నా యి. పట్టణంలో బుధవారం భారీ వర్షం పడ డంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యా యి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు గుమ్మాల్లోకి చేరింది, 2, 3, 4, 10, 11, 18, 22, 24, 28, 30 వార్డులలో ఇళ్ల వద్ద నీరు నిలిచి ఇబ్బంది పడ్డారు. పూలపల్లి కాపుల వీధిలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. బస్టాం డ్ వద్ద, బెత్లహం పేట, శ్రీరామ్‌పేట, శంభుని పేట, లక్ష్మీనగర్‌కాలనీ, హౌసింగ్ బోర్డుకాలనీ, రామారావు పేట తదితర ప్రాంతాల్లో వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి.