గుండెపోటుతో మోటార్‌ సైక్లిస్టు మృతి

ABN , First Publish Date - 2020-11-16T05:18:28+05:30 IST

మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెం దాడు.

గుండెపోటుతో మోటార్‌ సైక్లిస్టు మృతి
చంద్రశేఖర్‌ వద్ద రోధిస్తున్న భార్య రమాదేవి

దేవరపల్లి, నవంబరు 15: మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెం దాడు. పెదవేగి మండలం వేగి వాడ గ్రామానికి చెందిన రేలంగి చంద్ర శేఖర్‌ (51) అతని భార్య రమాదేవి వేగివాడ నుంచి మోటా ర్‌ సైకిల్‌పై రాజమండ్రి వెళ్తున్నా రు. మార్గమధ్యంలో దేవరపల్లిలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై చంద్రశేఖర్‌ పడిపోయాడు.  ఇం తలో దూబచర్ల నుంచి రాజ మండ్రి వెళ్తున్న ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు సంఘటన ప్రాంతంలో ఆగారు. బాధితుడిని 108లో ఆస్పత్రికి తరలించారు. దేవరపల్లి పీహెచ్‌సీకి చంద్రశేఖర్‌ను తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2020-11-16T05:18:28+05:30 IST