ఘనంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం
ABN , First Publish Date - 2020-03-02T11:47:39+05:30 IST
సామాజిక దురాగతాలపై కవులు తమ కలాలను సంధించాలని ప్రముఖ కవి, రచయిత, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. ఏలూరులోని ఎన్ గ్రాండ్ కన్షెక్షన్ హాలులో శ్రీశ్రీ కళావేదిక,

దురాగతాలపై కలం సంధించాలి
జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో డాక్టర్ కత్తిమండ
ఏలూరు కల్చరల్, మార్చి 1 : సామాజిక దురాగతాలపై కవులు తమ కలాలను సంధించాలని ప్రముఖ కవి, రచయిత, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. ఏలూరులోని ఎన్ గ్రాండ్ కన్షెక్షన్ హాలులో శ్రీశ్రీ కళావేదిక, వేదిక సీసీ టీవీ ఆదరణాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కవిత్వం ఒక సంచలన రాతల సమరం కావాలని కవిత్వంలో యాస, భాషలకన్నా భావానికే ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
కవులు కవిత్వాన్ని కొత్త కోణంలో రాయాలని, కవిత్వం చిరస్థాయిగా నిలవాలంటే సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకోవాలని కోరారు. వేదిక కన్వీనర్ డాక్టర్ ఆరవల్లి నరేంద్ర అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళంలో మొత్తం 150 మంది కవులు తమ కవితా గానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో కవితా ప్రవాహం సాగింది. బోళ్ల సతీష్ రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఆరవల్లి నరేంద్ర, జి.అంజు, కొల్లి రమావతి, రాధాకుసుమ, బీవీవీ సత్యనారాయణ, మట్టా సత్యనారాయణ, డాక్టర్ ఐ.సంధ్య తదితరులు పాల్గొన్నారు.