-
-
Home » Andhra Pradesh » West Godavari » gramodya trust founder chairman srinivas west godavari dist
-
విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
ABN , First Publish Date - 2020-12-29T05:06:42+05:30 IST
విద్యార్థులు చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కల్పించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని గ్రామోధ్యయ ట్రస్టు (డీఆర్‌డీఏ అనుబంధం) ఫౌండర్ చైౖర్మన్ చేకూరి శ్రీనివాస్ సూచించారు.

ఏలూరు రూరల్, డిసెంబరు 28:విద్యార్థులు చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కల్పించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని గ్రామోధ్యయ ట్రస్టు (డీఆర్‌డీఏ అనుబంధం) ఫౌండర్ చైౖర్మన్ చేకూరి శ్రీనివాస్ సూచించారు. స్థానిక సర్ సీఆర్ రెడ్డి పీజీ కళాశాలలో సోమవారం ‘వ్యవస్థాపక నైపుణ్యాలు మెరుగు పరుచు విధానాలు’ అంశంపై ఎంబీఏ విభాగం, ఎంటర్ ప్రైన్యూరల్ సెల్ ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దీనికి క్రమ శిక్షణ, ప్రణాళి కాబద్ధమైన ఆలోచన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల కరస్పాండెంట్ కె.శివరామకృష్ణ ప్రసాద్, కె.విష్ణుమోహన్, ప్రిన్సిపాల్ వీరభద్రరావు, డాక్టర్ రామరాజు, ఎండీఏ, ఎంకామ్ విభాగాధి పతులు జగపతిరావు, విజయకుమార్, అధ్యాపకులు సౌజన్య, శ్రీనివాసరావు, రాజేశ్, సుబ్బారావు, ఉపేంద్ర పాల్గొన్నారు